70 సమగ్ర సర్వే పూర్తి
కలెక్టర్ రాహుల్‌రాజ్
శాతం
కౌడిపల్లి(నర్సాపూర్): పథకాలు మరింత మెరుగు పర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో ఇంటింటి సమగ్ర సర్వే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2.20లక్షల కుటుంబాలు ఉండగా 70 శాతం సర్వే పూర్తి అయిందన్నారు. ప్రజలంతా సహకరిస్తున్నారన్నారు. వివరాలు చెపితే రేషన్, పింఛన్‌లు కట్ అవుతాయంటూ కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని నమ్మొద్దన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు తొలగించమని స్పష్టం చేశారు. సమాచారం మొత్తం గోప్యంగా ఉంటుందన్నారు. సర్వే ఫారాలను ఎంపీడీఓ కార్యాలయంలో ట్రంక్‌బాక్స్‌లో శాశ్వతంగా భద్రపరుస్తామని చెప్పారు. ప్రజలు ఆర్థిక, విద్య, ఆరోగ్య, రిజర్వేషన్లు తెలుసుకుని సంక్షేమ పథకాలు పక్కగా రూపొందించేందుకు సర్వే చేస్తున్నట్లు చెప్పారు.
సన్నలు కొనుగోలు చేస్తాం
మహమ్మద్‌నగర్‌లోని శ్రీసాయి ఆగ్రోస్ రైస్‌మిల్‌ను కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. ధాన్యం లారీలు ఎప్పుడొచ్చాయి ఎప్పుడు ఖాళీ అవుతాయని నిర్వాహకులు గోవర్ధన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొనుగోలు కేంద్రం పరిశీలించి ధాన్యం తేమశాతం పరిశీలించారు. పొల్లు లేకుండా తూకం వేయాలని చెప్పారు. సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైస్‌మిల్లు యజమానులు బీపీటీ సన్నధాన్యం వద్దంటున్నారని రైతులు చెప్పారు. ఇబ్బందులు లేకుండా త్వరలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, ఎన్యూమరేటర్లు, సొసైటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, సీఈఓ దుర్గాగౌడ్, మహిపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ వెంకన్న రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment