నాణ్యమైన భోజనం అందించాలి
మెదక్‌జోన్: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజ న్ జరగకుండా చూడాల్సిన బాధ్యత వార్డెన్లపై ఉందన్నారు. ముడి సరుకులు నిల్వ చేసే స్టోర్‌రూంలు పరిశుభ్రంగా ఉంచాలని, వంట పాత్రల శుభ్రం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన సన్న బియ్యం,తాజా కూరగాయలతో మెనూ సిద్ధం చేయాలన్నారు. పప్పులు, ఇతర దినుసుల నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఆర్వో ప్లాంట్ల పనితీరును పరిశీలించాలని, సురక్షిత తాగునీరు అందించాలని సూచించారు. వారానికి కనీసం మూడుసార్లు వసతి గృహాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే మంగళ, బుధవారంలో వంట సిబ్బందికి శిక్షణ నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లో సమస్యల నివృత్తికి జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ నగేష్ ప్రత్యేక అధికారిగా ఉంటారని వివరించారు. సమావేశంలో అన్నిశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ ఎంపిక
హవేళిఘణాపూర్(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పైలెట్ ప్రాజెక్టు కింద మెదక్ జిల్లా ఎంపిక కావడం అభినందనీయమని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం హవేళిఘణాపూర్ మండలం లింగ్సాన్‌పల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక సర్వేను పరిశీలించి మాట్లాడారు. తొలి విడతలో సొంత స్థలం ఉండి ఇళ్లు లేనివారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సర్వేను వేగవంతం చేసి పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు.
ఇందిరా మహిళా శక్తి భవనానికి నిధులు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభు త్వం నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం భవన నిర్మాణానికి కేటాయించే భూమిని పరిశీలించి మాట్లాడారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి పట్టణ సమీపంలోని ధ్యాన్‌చంద్ చౌరస్తా ఐటీఐ కళాశాల వెనుక భాగంలో ఎకరం భూమి కేటాయించినట్లు చెప్పారు. నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించిందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ నర్సింలు, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment