పల్లెలను ప్రగతి వైపు తీసుకెళ్లాలి
డీపీఓ యాదయ్య
కొల్చారం(నర్సాపూర్): అన్ని వనరులను ఉపయోగించుకొని పల్లెలను ప్రగతి వైపు తీసుకెళ్లాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని రంగంపేటలో పర్యటించారు. గ్రామంలోని డంప్యార్డ్, నిర్మాణ దశలో ఉన్న నూతన పంచాయతీ భవనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం, నర్సరీ, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్య పనులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. నిర్మాణదశలో ఆగిపోయిన నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సమగ్ర సర్వేపై ఆరా తీశారు. సర్వే పూర్తి కావొచ్చిందని, మండల కార్యాలయంలో డేటా ఎంట్రీని ప్రారంభించినట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారిని గ్రామానికి రప్పించి వందశాతం సర్వే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment