‘ముక్కోటి’కిముస్తాబు
● నేటి వైకుంఠ దర్శనాలకు సర్వం సిద్ధం
● దివ్వెల కాంతుల్లో వైష్ణవాలయాలు
● భారీగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు
మెదక్‌జోన్: ‘ముక్కోటి’కి వైష్ణవాలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. శుక్రవారం నిర్వహించే వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేశారు. ము క్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి ఆయా దేవాలయాల్లోని దేవతామూర్తులను దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని, అనేక పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకు భక్తులు అధిక సంఖ్యలో వైష్ణవాలయాలకు తరలివస్తారు. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇందుకోసం ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామి వారిని భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు సేవలు అందించనున్నారు. దేవాలయాలు రంగురంగుల దీపాల వెలుగుల్లో కాంతులీనుతుండగా.. ఉత్తర ద్వారాన్ని తోరణాలతో అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment