అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం
నర్సాపూర్: ఆర్‌టీఏ అధికారులు పట్టుకున్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలను ఆర్‌టీసీ డిపో ఆవరణలోని ఖాళీ ప్రాంతంలో భద్రపరిచారు. కాగా గురువారం ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఆటోలు, ఒక కారు అగ్నికి ఆహుతయ్యాయి. వాహనాలు ఉన్న ప్రాంతంలో పొగ రావడంతో తాము వెళ్లి చూసే సరికి పలు వాహనాలకు నిప్పంటుకుని మంటలు వచ్చాయని, మంటలు ఆపేందుకు ప్రయత్నించడంతో పాటు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చామని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. కాగా తాము వచ్చే వరకు పలు వాహనాలకు నిప్పంటుకుందని ఇన్‌చార్జ్ ఫైర్ ఆఫీసర్ ఐలయ్య చెప్పారు. ఐదు వాహనాలు దగ్ధమయ్యాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment