‘సేవ్ లైఫ్’ సేవలు అభినందనీయం
డీఎస్పీ వెంకట్‌రెడ్డి
తూప్రాన్: రహదారిపై ప్రమాదాల నివారణ కోసం ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు అభినందనీయమని డీఎస్పీ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్ డివిజన్ పరిధి పోలీస్‌స్టేషన్ల సిబ్బ ందితో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 44వ జాతీ య రహదారిని సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు దత్తత తీసుకున్నట్లు తెలిపారు. అతివేగంగా ప్రయాణించే వాహనాలపై ఆటోమెటిక్ ఛానల్ జనరేట్ అయ్యే విధంగా ఎన్‌ఫీఆర్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే రహదారిపై మరమ్మతులు గుర్తించి వెంటనే పనులు చేపడుతారని చెప్పారు. కాగా ప్రమాదాలు చోటు చేసుకున్న వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స, సురక్షితంగా తరలించే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ రంగకృష్ణ, ఎస్‌ఐలు శివానందం, సుభాష్‌గౌడ్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment