31వ పుట్టినరోజు జరుపుకున్నా! | Akkineni Nagarjuna Birthday Special Gift For Nag Fans | Sakshi
Sakshi News home page

31వ పుట్టినరోజు జరుపుకున్నా!

Published Sun, Aug 30 2020 2:11 AM | Last Updated on Sun, Aug 30 2020 2:11 AM

Akkineni Nagarjuna Birthday Special Gift For Nag Fans - Sakshi

‘వైల్డ్‌ డాగ్‌’లో..

‘‘శనివారం 31వ పుట్టినరోజు జరుపుకున్నాను’’ అని సరదాగా అన్నారు నాగార్జున. బర్త్‌డే సందర్భంగా నాగ్‌ మాట్లాడుతూ – ‘‘నాకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులకు, స్నేహితులకు ధన్యవాదాలు. ఐదున్నర నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌ చేయబోతున్నాను. ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 4’ షూటింగ్‌ స్టార్ట్‌ చేయబోతున్నాను. గత ఏడాది సీజన్‌ 3ని బాగా ఆదరించారు. బిగ్‌ బాస్‌ 4ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

ఇక నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’ రెండో లుక్‌ని బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టై¯Œ మెంట్‌ బ్యానర్‌పై నిరంజ¯Œ  రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్‌ వర్మ అనే ఎన్‌ఐఏ ఆఫీసర్‌ రోల్‌ను నాగార్జున చేస్తున్నారని ఈ పోస్టర్‌ ద్వారా వెల్లడైంది. నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేరస్తులతో వ్యవహరించే అత్యంత కఠినమైన తీరుతో ఏసీపీ విజయ్‌ వర్మను ‘వైల్డ్‌ డాగ్‌’ అని పిలుస్తుంటారు.

సంఘ విద్రోహ శక్తులను ఒక ఆపరేష¯Œ  ద్వారా విజయ్‌ వర్మ ఎలా తుద ముట్టించాడన్నది ఆసక్తిగా సాగుతుంది. ఇప్పటి వరకూ 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. సోమవారం నుండి తిరిగి ప్రారంభించనున్న చిత్రీకరణలో నాగార్జున పాల్గొంటారు’’ అన్నారు. దియా మీర్జా హీరోయి¯Œ గా నటిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షానీల్‌ డియో, సహ నిర్మాతలు: ఎ¯Œ .ఎం. పాషా, జగన్‌ మోహన్‌ వంచా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement