మెడలో తాళిబొట్టు ఏది? హీరోయిన్‌పై ట్రోలింగ్‌ | Deepika Padukone Getting Trolled For not Wearing Mangalsutra to Siddhivinayak Temple | Sakshi
Sakshi News home page

'మెడలో తాళి, ముఖానికి బొట్టు లేదు'.. ప్రశాంతంగా ఉండనివ్వరా?

Published Sun, Sep 8 2024 4:41 PM | Last Updated on Sun, Sep 8 2024 5:03 PM

Deepika Padukone Getting Trolled For not Wearing Mangalsutra to Siddhivinayak Temple

స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తను తల్లవడానికి ముందు శుక్రవారం నాడు ముంబైలో సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించి ఆశీర్వాదాలు తీసుకుంది. భర్తతో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లిన దీపిక మెడలో తాళిబొట్టు లేకపోవడంతో సోషల్‌ మీడియాలో హీరోయిన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.. కనీసం ముఖానికి బొట్టు కూడా పెట్టుకోదా? అని తిట్టిపోస్తున్నారు.

స్థోమత లేదా?
ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో నెటిజన్ల రియాక్షన్స్‌ ఇలా ఉన్నాయి.. 'ఇంత డబ్బు సంపాదిస్తున్న నీకు మంగళసూత్రం కొనుక్కునే స్థోమత లేకపోవడం బాధాకరం. పైగా నువ్వు తనిష్క్‌ నగల కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌!', 'కొన్నిచోట్ల మంగళసూత్రం తప్పనిసరి కాదు, ఓకే, కానీ ముఖానికి కుంకుమ అయినా పెట్టుకుంటే బాగుండేది కదా.. ముందు నువ్వు భగవద్గీతను అర్థం చేసుకో.. తర్వాత పక్కవారికి నీతులు చెప్పు' అని సెటైర్లు వేస్తున్నారు. 

ఆనందంగా ఉండనివ్వరా?
తన అభిమానులు మాత్రం.. 'ఆమె ఎలా ఉండాలి? ఎలా కనిపించాలన్నది తనిష్టం.. ఇప్పుడామె ఒక బిడ్డకు తల్లి.. ఎందుకని ఇలాంటి కామెంట్లతో తనను బాధిస్తున్నారు?', 'దర్శనం తర్వాత బొట్టుతోనే బయటకు వచ్చిందిగా, అది కనిపించట్లేదా?' అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా దీపిక పదుకొణె చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో కనిపించింది. నెక్స్ట్‌ సింగం అగైన్‌ సినిమా చేయనుంది. ఇందులో రణ్‌వీర్‌ కూడా యాక్ట్‌ చేయనున్నాడు. అలాగే రణ్‌వీర్‌ డాన్‌ 3 మూవీ చేస్తున్నాడు.

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement