రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కానీ అడపాదడపా వీళ్లిద్దరూ కలిసి తిరుగుతూ కెమెరాలకు చిక్కుతూ ఉన్నారు. తాజాగా ఈ జంట ముంబైలో మరోసారి కెమెరాలకు దొరికిపోయింది. బాంద్రాలోని రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి డిన్నర్ డేట్ ముగించుకుని బయటకు వచ్చిన వీళ్లిద్దరూ కెమెరాలకు చిక్కారు.
ముందుగా విజయ్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చోగా తర్వాత రష్మిక వెనకాలే వచ్చి అతడి కారెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూశాక నెటిజన్లు ఊరుకుంటారా? 'ఓ మై గాడ్.. క్రష్మిక, లవ్‌కొండ.. ఆలియా, రణ్‌బీర్ జంటను తలపిస్తున్నారు', 'వీళ్ల ప్రేమజంట ఎంత చూడముచ్చటగా ఉందో..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అయితే వీళ్లు తమ ప్రేమను అధికారికంగా ప్రకటించబోతున్నారా? అని ఆరా తీసేందుకు ప్రయత్నించారు. మొత్తానికి విజయ్, రష్మికల డిన్నర్ డేట్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. కాగా వీళ్లిద్దరూ గీతా గోవిందం(2018), డియర్ కామ్రేడ్(2019) చిత్రాల్లో జంటగా నటించి ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment