Vikram Lagadapati Virgin Story Movie Is Now A Hit On AHA OTT - Sakshi
Sakshi News home page

Virgin Story: ఆహాలో అదరగొడుతున్న వర్జిన్ స్టోరీ, ఈ రెస్పాన్స్‌ ఊహించలేదన్న హీరో

Published Sun, May 7 2023 9:20 PM

Vikram Lagadapati Felt Happy Over Virgin Story Response On AHA - Sakshi

"కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, రుద్రమదేవి, పటాస్, రేసుగుర్రం" చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన విక్రమ్ లగడపాటి "గోలిసోడా" చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో "ఎవడూ తక్కువ కాదు" పేరిట డబ్‌ అయింది. అల్లు అర్జున్ టైటిల్ రోల్ ప్లే చేసిన "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా"లో విక్రమ్ పోషించిన అన్వర్ అనే ముస్లిం కుర్రాడి పాత్ర నటుడిగా అతడి ప్రతిభకు అద్దం పట్టింది. దిల్ రాజు నిర్మించిన "రౌడీ బాయ్స్" చిత్రంలోనూ రౌడీ కుర్రాళ్లలో ఒకడిగా నటించి మెప్పించాడు విక్రమ్.

తాజాగా అతడు నటించిన వర్జిన్ స్టోరీ ఆహాలో ప్రసారమవుతుండగా మంచి స్పందన రాబడుతోంది. ప్రదీప్ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్ సరసన సౌమిక నటించింది. ఆహాలో "వర్జిన్ స్టోరీ"కి వస్తున్న ఆదరణ గురించి విక్రమ్‌ లగడపాటి మాట్లాడుతూ... ఇంత గ్రాండ్ రెస్పాన్స్ తాను అస్సలు ఊహించలేదని పేర్కొన్నాడు. ఈ క్రెడిట్ అంతా ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ చెందుతుందని అన్నాడు. తను హీరోగా నటించే తదుపరి చిత్రంతోపాటు ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని చెప్పాడు. వర్జిన్ స్టోరీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.

చదవండి: ఝాన్సీతో విడాకులు, కూతురు తిరిగొస్తుందనుకున్నా, కానీ: జోగి నాయుడు

Advertisement
Advertisement