ఏటూరునాగారం: మిర్చి ఏరేందుకు, భవన నిర్మాణ కార్మికులుగా చదువుకునే చిన్నారులు కూలి పనులకు వెళ్తున్నారు. పేదరికం ఒకవైపు, తల్లిదండ్రులకు అవగాహన లేమి కారణంగా చిన్నారులు పనులకు వెళ్లటం బాధాకరం. ఏటూరునాగారం మండల కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి మహిళా కూలీలతో వచ్చి ఇక్కడ పనులు చేసుకొని ప్రైవేటు వాహనాల్లో తరలిపోతున్నారు. ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలు, సంరక్షణ చర్యలు బాగున్నాయని గొప్పలు చెప్పుకోవడం తప్పా పిల్లల బాగోగులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment