నేడు జాతీయ యువజన దినోత్సవం
పల్లె శాస్త్రవేత్తగా.. మహిపాల్‌చారి
పరకాల: సొంత ఆలోచనతో 11 ఏళ్ల క్రితం పవర్ వీడర్‌ను తయారుచేసి పల్లె శాస్త్రవేత్తగా పేరుపొందిన పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామం సీతారాంపూర్‌కు చెందిన కడవెండి మహిపాల్‌చారి.. తాజాగా రైతులు తమ దిగుబడులను సులువుగా తరలించేందుకు పల్లె సృజన పేరిట ఎలక్ట్రిక్ ట్రాలీ తయారు చేశారు. పదవ తరగతి చదివిన మహిపాల్‌చారి 2013లో తయారు చేసిన పవర్ వీడర్‌ను స్థానిక రైతులకే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేశారు. ఈ క్రమంలో వ్యవసాయ కూలీల కొరతను దృష్టిలో ఉంచుకొని కల్టివేటర్, గ్రామాలకు, పట్టణాలలో ఉండే గోదాములకు ఎంతో ఉపయోపడే ట్రాక్టర్ అటాచ్డ్‌మెంట్ క్రేన్‌తోపాటు ఎలక్ట్రిక్ ట్రాలీ(పల్లె సృజన) రూపొందించాడు. అమేజింగ్ ఇండియన్ అవార్డు సాధించాడు. ‘దేశానికి అన్నంపెట్టే రైతుల కోసం ఎంత శ్రమించినా తక్కువే. వారి కోసం భవిష్యత్‌లో మరిన్ని పరికరాలు అందుబాటులోకి తీసుకొస్తా’అని మహిపాల్‌చారి అంటున్నారు.
సొంత సంపాదనతో కుటుంబానికి ఆర్థిక అండ
Comments
Please login to add a commentAdd a comment