పథకాల అమలుకు జాబితా రూపొందించాలి
ములుగు: రైతు భరోసా, ఇందిరమ్మ అత్మీమ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అమలుపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమం, నిరుపేద కుటుంబాల అభివృద్ధికి రైతు భరోసా, ఇందిరమ్మ అత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు ప్యూరిఫికేషన్ పక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతు భరోసా పథకంలో అర్హులైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి లబ్ధిదారుల పేర్లు జాబితాలో చేర్చాలని అన్నారు. ఇందిరమ్మ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించడానికి అవసరమైన జాబితాను తయారు చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించే పక్రియను వేగంగా చేపట్టాలన్నారు. ప్యూరిఫికేషన్ ప్రక్రియ 16వ తేదీ నుంచి ప్రారంభించి 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 18వ తేదీన ఫీల్డు వర్క్ పనులు పూర్తి చేసి 19వ తేదీ నాటికి కార్యాయలంలో సమీక్ష నిర్వహించి, తుది జాబితాను 20వ తేదీన సమర్పించాలని తెలిపారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి, తుది జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఖరారు చేయాలని అన్నారు. ప్రతి మండలాన్ని రెండు భాగాలుగా విభజించి ప్రతి భాగానికి డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యత అప్పగించాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు సీనియర్ అసిస్టెంట్, లేదా జూనియర్ అసిస్టెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకుని డేటాను సక్రమంగా సమీక్షించి సరైన పద్ధతిలో సర్వేను పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావు, అధికారులు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ దివాకర
Comments
Please login to add a commentAdd a comment