హేమాచల క్షేత్రం.. భక్తజన సందోహం
మంగపేట: మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం శనివారం భక్త జనసందోహంతో సందడి నెలకొంది. వందల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణంతోపాటు, చింతామ ణి జలపాతం, వనదేవత(దైతఅమ్మవారి) ప్రాంతం భక్త జనంతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి జిల్లాలోని లక్నవ రం, రామప్ప, బ్లాక్‌బెర్రీ తదితర పర్యాటక ప్రాంతా లను తలకించేందుకు వచ్చిన పర్యాటకులు, మేడా రం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకు న్న అనంతరం హేమాచలున్ని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర రామానుజ దాస్ స్వామివారికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. తిలతైలాభిషేకం పూజలో పా ల్గొన్న భక్తులు మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా కనిపించింది.
రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు కిక్కిరిసిన ఆలయ పరిసరాలు
Comments
Please login to add a commentAdd a comment