కదిలిన యంత్రాంగం
ములుగు రూరల్: మండల పరిధిలోని ఇంచర్ల బీట్ పరిధి బరిగలానిపల్లి శివారు వరాల గుట్టపై టేకుచెట్లు మాయం అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. ఈ విషయంపై బుధవారం అటవీశాఖ రేంజ్ అధికారితో పాటు నాలుగు బృందాలు విచారణ చేపట్టాయి. రేంజర్ డోలి శంకర్ ఆధ్వర్యంలో బృందాలు వరాల గుట్టలో కోతకు గురైన టేకు చెట్లును గుర్తించడంతో పాటు గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కార్పెంటర్ వర్క్ చేస్తున్న షణ్ముకచారి ఇంట్లో సోదాలు నిర్వహించి ఎలాంటి ఆధారాలు లేని 25 టేకు దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా టేకు కలపను అక్రమంగా నరికి తరలిస్తున్నందున వరాల గుట్టను పరీశీలించారు. రేంజ్ అధికారి ఆధ్వర్యంలో నాలుగు బృందాల సభ్యులు గుట్టను పరిశీలించారు. కోతకు గురైన టేకు చెట్లును గుర్తించారు. ఈ క్రమంలో అడవిలో దాచి ఉంచి 10 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గుట్టపై ఉన్న టేకు చెట్లు సుమారు 10 నుంచి 15 చెట్లు మాత్రమే కోతకు గురైనట్లు పరిశీలించామని, నరికి తరలించిన వారిని గుర్తించి శాఖాపరమైన కేసులు నమోదు చేస్తామని ఎఫ్‌ఆర్‌ఓ డోలి శంకర్ తెలిపారు.
● వరాల గుట్టను పరిశీలించిన
అటవీశాఖ అధికారులు
● ఒకరిపై కేసు నమోదు,
టేకు దుంగలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment