గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
ఏటూరునాగారం: షెడ్యూల్ ప్రాంతాల్లోని గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో సోమవారం 9వ రాష్ట్ర మహాసభల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న వట్టం ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న అసైన్డ్, అటవీ భూములకు ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని సభలో తీర్మాణించినట్లు తెలిపారు. అదే విధంగా సభలో ఎస్టీ వర్గీకరణ కోసం ఆదివాసీ పరివర్తన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరిలో ఉంటుందని, ఏజెన్సీ చట్టాలు, హక్కుల అమలుపై శిక్షణ తరగతులు మార్చిలో ఉంటాయన్నారు. వరంగల్‌లో ఏప్రిల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
నూతన కమిటీ ఎన్నిక
నూతనంగా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కబ్బాక శ్రావణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొము రం శేషయ్య, కొమురం ప్రభాకర్, గంట సత్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గుంపిడి వెంకటేశ్వర్లు, గంజి రాజన్న, మల్లెల రాము, కోరం శేషయ్య, ధనసరి రాంమూర్తి, వట్టం కన్నయ్య, రాష్ట్ర కార్యదర్శులుగా పుణమ్ బాలకృష్ణ, చింత కృష్ణ, వర్ష శ్రీనివాస్, బుర్క యాదగిరి, గంట సత్యం, రామినేని సురేందర్, ప్రచార కార్యదర్శులుగా గొంది నగేష్, పూనెం శ్రీనివాస్, బచ్చల ఎర్రయ్య, పాయం జానకి రమణ, మడకం చిట్టిబాబు, కోశాధికారిగా అరెం నారాయణ, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిడం జంగుదేవ్, ప్రధాన కార్యదర్శిగా యాప అశోక్, ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా మైపతి వీణారాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొమురం లక్ష్మీకాంతలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఉపేందర్ తెలిపారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ జాతీయ కో కన్వీనర్ యాసం రాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వట్టం జనార్ధన్, చందా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్
Comments
Please login to add a commentAdd a comment