వినతులు సత్వరమే పరిష్కరించాలి
ములుగు: ప్రజావాణిలో వచ్చే వినతులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అడిషనల్ కలెక్టర్లు సంపత్‌రావు, సీహెచ్ మహేందర్‌జీలతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు సంబంధించి 39 దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి గ్రామస్థాయిలో జరుగుతున్న సర్వే ప్రక్రియ పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలన్నారు. ఈ నెల చివరి వరకు సర్వే పూర్తి చేయాలన్నారు. సాధ్యమైనంత వరకు మండలస్థాయిలో సమస్యలను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు.
గిరిజన దర్బార్‌లో..
ఏటూరునాగారం: గిరిజన దర్బార్‌లో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను డీడీ పోచం, ఐటీడీఏ ఏఓ రాజ్‌కుమార్‌లు ఆదేశించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వారు సోమవారం వినతులు స్వీకరించారు. వెంకటాపురం(కె) మండలం కమ్మరిగూడానికి చెందిన పూనెం సాయి మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామ పంచాయతీ పరిదిలోని కొమురం భీం కాలనీ ఆదివాసుల భూ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. మంగపేట మండలం మల్లూరుకు చెందిన తాటి విజయ్‌బాబు మల్లూరు గుట్ట శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర వివిధ అభివృద్ధి పనులు పెసా గ్రామసభ వీడీసీ ద్వారానే చేపట్టాలన్నారు. మహబూబాబాద్ మండలం మొండ్రాయిగూడెంకు చెందిన బానోతు సరోజ తన కుమార్తె దివ్యాంగురాలని, ఫోర్ వీలర్ స్కూటి ఇవ్వాలని వేడుకున్నారు. ఇలా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ సురేష్, ఏఓ సంతోష్, ఆలం కిశ్‌ర్, అనిల్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, జేడీఎం కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment