భిక్షాటన చేసి ఉద్యోగుల నిరసన
ములుగు: సమగ్రశిక్ష ఉద్యోగులు సమ్మే కార్యక్రమంలో భాగంగా 15వ రోజు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి, ఆయా కాలనీల్లోని దుకాణాలు, కార్యాలయాల్లో భిక్షాటన చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్, కోశాధికారి కుమార్ పాడ్య, ఉపాధ్యక్షుడు ఎండీ ఫిరోజ్, కార్యవర్గ సభ్యులు సుజాత, రమేశ్ పాల్గొన్నారు.
డిమాండ్లు నెరవేర్చాలి
సమగ్రశిక్ష ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ సీనియర్ నాయకుడు దిలీప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్ష శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ.. సమగ్రశిక్ష ఉద్యోగుల విషయంలో శాసనసభలో లేవనెత్తకపోవడం బాధాకరం అని అన్నారు. సమ్మే కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యాశాఖ కార్యాలయాల్లో రోజువారి కార్యక్రమాలు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీనియర్ నాయకుడు హట్కర్ సమ్మయ్య పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓకు మెమోరాండం అందించారు. రఘురాం, రామల్, జయరాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment