28న ప్రభాకర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
ఏటూరునాగారం: ఐటీడీఏ కార్యాలయంలో పెసా కోఆర్టినేటర్‌గా పనిచేస్తున్న కొమురం ప్రభాకర్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా చైర్మన్ డాక్టర్ రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న హైదరాబాద్‌లోని ముషీరాబాద్ సిటీ కల్చరల్ ఆడిటోరియంలో ఏషియన్ కల్చరల్ అండ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ స్ఫూర్తి అకాడమీ న్యూఢిల్లీ, ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా, స్ఫూర్తి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అకాడమీ ఆకుల మహేందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమురం ప్రభాకర్‌ను సత్కరించి గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. భారత రాజ్యాంగం ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న ఆదివాసీలకు కల్పించిన 5వ షెడ్యూల్ లోని హక్కులు, చట్టాల అమలుకు ఆయన కృషి చేస్తున్నందున డాక్టరేట్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
దహన సంస్కారాలకు విరాళల సేకరణ
ములుగు రూరల్: జిల్లాకేంద్రానికి చెందిన నిరుపేద మామిడి రాజు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో దహన సంస్కారాలకు సీపీఎం పట్టణ కార్యదర్శి సద్దాహుంస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం విరాళాలు సేకరించారు. వ్యాపారుల వద్ద రూ. 15200 విరాళాలను సేకరించి మృతుడి కుటుంబానికి అందించారు. చింత రాజు, భరత్, రోహిత్, కన్నయ్య, ప్రవీణ్, అజయ్ తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి గాయాలు
ములుగు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలైన సంఘటన మండలంలోని జంగాలపల్లి మంగళవారం చోటు చేసుకుంది. తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంచర్ల గ్రామానికి చెందిన కడాసుల రవి ద్విచక్ర వాహనంపై ములుగు వస్తున్నారు. ఈ క్రమంలో హనుమకొండ వైపు నెంచి ఏటూరునాగారం వెళ్తున్న కారు రోడ్డు క్రాస్ చేస్తుండగా ఢీ కొట్టింది. దీంతో కడాసుల రవికి గాయాలు కావడంతో గమనించిన గ్రామస్తులు 108 సాయంతో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పురుగుల మందు
తాగి విద్యార్థి ఆత్మహత్య
మంగపేట: కాలేజీకి వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండగా తండ్రి మందలించడంతో మనస్థాపంతో గుండారపు రఘు(21) విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెరుపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై టీవీఆర్ సూరీ తెలిపిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చెరుపల్లి గ్రామానికి చెందిన మృతుడు రఘు ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండు మూడు నెలల నుంచి 15 రోజులకు ఒక సారి లేదా తనకు ఇష్టం వచ్చినప్పుడు కళాశాలకు వెళ్తు జులాయిగా తిరుగుతుండటంతో తండ్రి ఈశ్వరయ్య కుమారుడిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురై రఘు సోమవారం పురుగు ల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్ప డ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న రఘును కు టుంబ సభ్యులు హుటాహుటిన ఏటూరునా గారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం మృతుడి తండ్రి ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment