డీసీఆర్బీ డీఎస్పీగా కిశోర్
ములుగు: జిల్లా క్రైం రికార్డ్స్ బ్యూరో(డీసీఆర్బీ) డీఎస్పీగా కిశోర్‌కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ శబరీశ్‌కు పూలమొక్కను అందించి మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
‘ఆరోపణలు చేస్తే
ఊరుకునేది లేదు’
కాటారం: రాష్ట్రంతో పాటు మంథని నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబుపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మల్హర్ మాజీ జెడ్పీటీసీ కొండ రాజమ్మ, కాంగ్రెస్ మండల మహిళ అధ్యక్షురాలు జాడి మహేశ్వరీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మహదేవపూర్‌లో బీఆర్‌ఎస్ నాయకురాలు గీతాబాయి మంత్రిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తున్న గీతాబాయి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుందని విమర్శించారు. మంత్రి శ్రీధర్‌బాబు, శ్రీనుబాబును విమర్శించే స్థాయి ఆమెది కాదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంశంలో మంత్రికి, ఆయన సోదరుడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. శకుంతల, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment