‘ఉద్యోగ భద్రత సాధించే వరకు పోరాటం’
ఏటూరునాగారం: సీఆర్‌టీలకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాటం చేద్దామని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర పోల్‌సింగ్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చల ఎర్రయ్య, ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సప్క నాగరాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట సీఆర్‌టీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మెకు లంబాడీ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ ఫెడరేషన్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగం చేస్తున్న సీఆర్‌టీలను రెగ్యులరైజ్ చేయాలన్నారు. వారి డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్, రామయ్య, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమ్మెకు మద్దతు
వెంకటాపురం(కె): ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఏటూరునాగారం ఐటీడీఏ వద్ద చేపట్టిన నిరవదిక సమ్మెకు తెలంగాణ ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు మంగళవారం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏటీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సప్క నాగరాజు మట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలన్నారు. ఆయన వెంట సీఆర్‌టీల రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్వర్, ఉపాధ్యక్షుడు రవీందర్, జిల్లా అధ్యక్షుడు కొండ రామయ్య తదితరులు ఉన్నారు.
ఆదివాసీ సంఘాల నాయకులు
Comments
Please login to add a commentAdd a comment