అడవికి నిప్పు.. మానవాళికి ముప్పు
వాజేడు: అడవికి నిప్పు పెడితే మానవ మనుగడకు ముప్పని ఎఫ్‌ఎస్‌ఓ దేవయ్య అన్నారు. మండల పరిధిలోని ప్రగళ్లపల్లి, మొరుమూరు, కొంగాల గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది అడవిని సంరక్షించాలని కోరుతూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఓ దేవయ్య మాట్లాడుతూ అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. అడవిలో నిప్పు పెడితే మంటలు చెలరేగి అడవికి నష్టం వాటిల్లుతుందన్నారు. దాని మూలంగా మనకు అందే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందకపోగా సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా అడవిలో నిప్పు పెడితే అటవీ శాఖ సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. బీట్ ఆఫీసర్లు గొంది నారాయణ, లలిత, సంతోష్ కుమార్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
ఎఫ్‌ఎస్‌ఓ దేవయ్య
Comments
Please login to add a commentAdd a comment