పరామర్శ
మల్హర్: మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్‌రావు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం పరామర్శించారు. లక్ష్మణ్‌రావు మృతదేహానికి పార్టీ కండువా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు, రాజేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కారుపాక కొమురమ్మ కటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కేదారి గీత, శ్రీపతి బాపు, అలీంఖాన్, జవ్వాజీ తిరుపతి, మహేష్, సల్మాన్‌తో పాటు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment