సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను అధికారులు పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడారం జాతర చైర్మన్ లచ్చుపటేల్, మాజీ సర్పంచులు ఇర్ప సునీల్‌దొర, మంకిడి నరసింహస్వామి, బెజ్జూరి శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాక రాజేందర్ పాల్గొన్నారు.
గోవిందరావుపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ సృజన్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, సహాకార సంఘం అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి, జిల్లా కార్మిక శాఖ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి నాయకులు పాల్గొన్నారు.
గ్రంథాలయ సంస్థ జిల్లా
చైర్మన్ రవిచందర్
Comments
Please login to add a commentAdd a comment