మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఏటూరునాగారం: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం–3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సందర్శించి కేంద్రానికి వచ్చిన రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రానికి వచ్చే రోగులకు, గ్రామాల్లోని ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు వస్తారని సిబ్బందికి తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ మలేరియా, డెంగీ, ఆర్‌డీటీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాల, ఆశ్రమ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత, ఆహారపు అలవాట్లు శారీరక శ్రమపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యాధికారులకు ఆయుష్మాన్ ఆరోగ్యం డాక్టర్లకు, మల్టీ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలకు జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు, జాతీయ అసంక్రమిత నియంత్రణ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పవన్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మధుమేహం, హైపర్ టెన్షన్ వ్యాధుల నిర్ధారణ పరీక్షలను 30ఏళ్లకు పైబడిన అందరికీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మూడో విడత పరీక్షలు వందశాతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుమలత, డాక్టర్ మమత, ఇన్‌చార్జ్ డెమో సంపత్, అసంక్రమిత వ్యాధుల జిల్లా కోఆర్డినేటర్ వెంకటరెడ్డి, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, సూపర్‌వైజర్ గంగా, ఖలీల్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment