‘ప్రజల అభిప్రాయానికి విలువ ఇస్తాం’
ఏటూరునాగారం: ప్రజల అభిప్రాయాలకు విలువ ఇస్తామని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ‘పోలీసులు ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వడం జరుగుతుంది’ అనే వాల్ పోస్టర్లను ఏటూరునాగారం సబ్ డివిజన్ కేంద్రంలో గురువారం ఏఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ శబరీశ్ ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా పోలీసుల సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అందిస్తున్న సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు ప్రత్యేకంగా ’క్యూఆర్ కోడ్’ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. క్యూఆర్‌కోడ్‌పై స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలు తెలుపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఏఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సైలు తాజొద్దీన్, కృష్ణప్రసాద్, తిరుపతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
సూరగుండయ్య గుట్టను
సందర్శించిన చైన్నె క్రైస్తవులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని సూరగుండయ్య గుట్టలను చైన్నెలోని బైబుల్ కళాశాలకు చెందిన క్రైస్తవులు గురువారం సందర్శించారు. సూరగుండయ్య గుట్టపై రాతి శిలువల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం సూరగుండయ్య గుట్టలపై రాతి శిలువలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ప్రతిఏటా రాతి శిలువల వద్దకు వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చైన్నె బైబుల్ కళాశాల క్రైస్తవులు సందర్శించి శిలువల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ సతీశ్‌బాబు, బాగె నర్సింహులు, పాయం సమ్మయ్య, చిట్టిబాబు, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి క్రికెట్ టోర్నమెంట్
ములుగు రూరల్: మండల పరిధిలోని కొత్తూరులో దేవుని గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నేటి నుంచి 17వ తేదీ వరకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు వీరంనేని కిషన్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్‌ను దేవస్థానం కమిటీ ముఖ్య సలహదారు వీరంనేని నితిన్‌రావు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 31జట్లు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. గెలుపొందిన జట్టుకు మొదటి బహుమతి రూ.30,116, రెండో బహుమతి 15,116లను అందించనున్నట్లు వెల్లడించారు.
సింగరేణి క్యాలెండర్
ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం ముద్రించిన క్యాలెండర్‌ను గురువారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అధికారులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, వివిధ విభాగాల అధికారులు జ్యోతి, రవికుమార్, మారుతీ, పోషమల్లు, దయాకర్, రజినీ, కార్తీక్ పాల్గొన్నారు.
ప్రభావిత గ్రామాలను
తరలించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్–2 సమీపంలోని ప్రభావిత గ్రామాల ప్రజలకు నష్టపరిహారం చెల్లించి గ్రామాలను తరలించాలని భూ నిర్వాసితులు కోరారు. ఈ మేరకు ఆకుదారివాడ, ఫక్కిరగడ్డ గ్రామాల భూ నిర్వాసితులు గురువారం ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఐదేళ్లుగా ఓసీ సమీపంలో నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ భూములను కోల్పోయి ఉపాధి లేకుండా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు బుర్ర మనోజ్, అనిల్, రాజయ్య, శంకర్, సాయి, కిషోర్, రమేష్, మహేష్, రవి, సురేష్, రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment