బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టడం సరికాదు
ములుగు రూరల్: బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టడం సరికాదని మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశానికి జిల్లా ఎన్నికల అధికారి విజయచందర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించే దిశగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ములుగు మండల అధ్యక్షుడిగా రాయంచు నాగరాజు, వెంకటాపూర్(ఎం) అధ్యక్షుడిగా పైడాకుల మల్లేష్, గోవిందరావుపేట మార్క సతీష్, ఏటూరునాగారం వినుకోలు చక్రవర్తి, ఎస్‌ఎస్‌తాడ్వాయి తాళ్లపల్లి లక్ష్మణ్, మంగపేట రావుల జానకిరావు, కన్నాయిగూడెం దుర్గం సమ్మక్క, కొత్తగూడెం యాదగిరి మురళి, గంగారం మండల పార్టీ అధ్యక్షుడిగా నరేందర్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, అజ్మీర కృష్ణవేణి, కొత్త సురేందర్, వెంకన్న, రవీంద్రాచారి పాల్గొన్నారు.
మాజీ ఎంపీ సీతారాంనాయక్
Comments
Please login to add a commentAdd a comment