వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటుంది. రాత్రివేళ చలితో పాటు మంచు పడుతుంది.
సదరం క్యాంపులకు షెడ్యూల్
ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సదరం క్యాంపులను నిర్వహించడానికి కలెక్టర్ దివాకర్ ఆదేశాల మేర కు మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.జగదీశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొత్తగా సదరం ధ్రువీకరణ పత్రాలను పొందాలనుకునే వారు, ముగిసిన సదరం ధ్రువీకరణ పత్రాల పునరుద్ధరణకు దివ్యాంగులు సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో రూ.35 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. వారు ఇచ్చే రశీదు, సంబంధిత వైద్య పరీక్షల రిపోర్టులను తీసుకుని సూచించిన తేదీన సదరం క్యాంపునకు హాజరు కావాలని కోరారు. వైద్య పరీక్షల అనంతరం అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. సదరం క్యాంపులు నిర్వహించే తేదీలు ఈ నెల 22, ఫిబ్రవరి 5, 19, మార్చి 12, 26 తేదీలలో శారీరక దివ్యాంగులు, కంటిచూపు సమస్యలు ఉన్నవారు హాజరు కావాలని కోరారు. అలాగే ఈ నెల 29, ఫిబ్రవరి 12, మార్చి 5, 19వ తేదీలలో బుద్ధి మాద్యం, మానసిక రుగ్మత, మూగ, వినికిడి లోపం ఉన్న వారు హాజరు కావాలని కోరారు. సదరం క్యాంపునకు హాజరయ్యే వారు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌ఫొటో, టెంపరరి సర్టిఫికెట్ ఉన్నవారు వెంట తెచ్చుకోవా లని సూచించారు. అలాగే మెడికల్ రిపోర్ట్స్ ఉన్న వారు తీసుకొని రావాలని వెల్లడించారు.
108 వాహనంలో ప్రసవం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని నూగూరుకు చెందిన మడకం సునీత 108 అంబులెన్స్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మడకం సునీతకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా ఎదుల్ల చెరువు వద్ద పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం 108సిబ్బంది తల్లీబిడ్డను వైద్యశాలలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment