పండుగ పూట పస్తులేనా..!
వెంకటాపురం(ఎం): అంతంతమాత్రంగా వేతనాలు.. ఆపై నెలలు తరబడి బకాయిలు.. పూట గడవక ఇబ్బందులు.. ఆర్థిక కష్టాలతో అప్పులు.. ఇది జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికుల దుస్థితి. గ్రామ సచివాలయ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు లేనిదే గ్రామం పరిశుభ్రంగా ఉండదు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు వెట్టి చాకిరీ చేయాల్సిందే. అయినా.. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో కార్మికులు పండుగ పూట కూడా పస్తులేనా అని ఆవేదన చెందుతున్నారు.
174 పంచాయతీలు, 899 మంది కార్మికులు
జిల్లా వ్యాప్తంగా 174 గ్రామ పంచాయతీల్లో 899 మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. ప్ర భుత్వం జనాభా ప్రతిపాదికన మల్టీపర్పస్ వర్కర్ల నియామాకానికి చర్యలు చేపట్టి ప్రతి 500 జనాభా కు ఒక కార్మికున్ని నియమించింది. గ్రామానికి ఒక టి చొప్పున 174 ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లను పంచాయతీ అధికారులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.9,500 చొ ప్పున ప్రభుత్వం వేతనాలు చెల్తిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అంతేకాకుంగా నిత్యం గ్రామంలో మురికి కాల్వలు, రోడ్లు ఊడ్చుట, పాఠశాలలను శుభ్రం చే యడం, డ్రెయినేజీలను క్లీన్ చేయడం, చెత్తను తొలగించడం, పైపులైన్ లీకేజీల మరమ్మతుకు గుంతలు తీయడం లాంటి పనులు చేస్తున్నారు. వాటితోపా టు పల్లెప్రకృతి వనాల్లో నీళ్లు పట్టడం, రోడ్లవెంట నాటిన మొక్కలను సంరక్షించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పంచాయతీ పరిధిలో జరిగే ప్రతి పనిలో కార్మికులు నిమగ్నమవుతూ గ్రామాల ప్రగతిలో కీలకపాత్ర వహిస్తున్నారు.
మూడు నెలలుగా అందని వేతనాలు
జిల్లాలోని 9 మండలాల పరిధిలో 899 మంది కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు అందలేదు. సుమారు రూ.2.56 కోట్ల వేతనాలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. కొత్త ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పంచాయతీ కార్యదర్శుల ద్వారా కార్మికుల బ్యాంక్ ఖాతాలు, ఆధార్‌కార్డులు సేకరించి కొత్త సంవత్సరం నుంచి నేరుగా కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమచేస్తామని వెల్లడించింది. దీంతో బకాయి ఉన్న రెండు నెలలతోపాటు ప్రస్తుత నెల వేతనం కూడా అందుతుందన్న కార్మికుల ఆశలు ఆడియాశలయ్యాయి. పది రోజులు గడిచినా వేతనాలు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. బకాయి వేతనాలు కాకుండా ప్రస్తుత నెల వేతనాలు చెల్లించిన పండుగను ప్రశాంతంగా జరుపుకుంటామని పంచాయతీ కార్మికులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండుగకు కిరాణ సామగ్రి కొనలేని పరిస్థితిలో ఉన్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికోసారి జరిగే సంక్రాంతి పండుగకు కూడ జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పిండివంటలు చేసేందుకు కూడా జేబులో ఒక్క రూపాయి లేదని ఆందోళన చెందుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు తమవని, కరోనా సమయంలో సైతం ప్రాణాలుపణంగా పెట్టి విధులు నిర్వహించామని, ప్రస్తుతం వేతనాలు రాక అర్థాకలితో అలమటిస్తున్నామని, ప్రభుత్వ అధికారులు స్పందించి వేతనాలు అందించాలని వారు కోరుతున్నారు.
మూడు నెలలుగా అందని వేతనాలు
ఇబ్బందుల్లో పంచాయతీ కార్మికులు
జిల్లా వ్యాప్తంగా విధుల్లో 899 మంది
Comments
Please login to add a commentAdd a comment