పాడిలో నకీర్త శ్రీనివాసు
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన నకీర్త శ్రీనివాసు వ్యవసాయానికి అనుబంధంగా పాడి గేదెలతోపాటు గొర్రెల పెంపకం, కూరగాయలను సాగు చేస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలాగా నెలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర సంపాదిస్తున్నారు. తనకు ఉన్న 14 ఎకరాలకు తోడుగా మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. 12ఎకరాల్లో కూరగాయలు, 10ఎకరాల్లో వరి, మిగిలినది గొర్రెలకు కంచెగా ఉపయోగిస్తున్నారు. అతని వద్ద ఎనిమిది మంది కూలీలు నిత్యం పని చేస్తుంటారు. ‘నాకు ఇతరుల దగ్గర పనిచేయడం ఇష్టం ఉండదు. అందుకే గ్రామంలో వ్యవసాయం చేస్తున్నా. పాడి, గొర్రెల పెంపకం, కూరగాయలసాగుతో నెలకు రూ.లక్షన్నర వరకు సంపాదిస్తున్నా. ఎంతో సంతోషంగా ఉంది’ అని శ్రీనివాసు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment