మాధవి..కోళ్ల పెంపకంలో బిజీ..
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామానికి చెందిన దేవ మాధవి బీకాం కంప్యూటర్ పూర్తి చేసి ఉద్యోగం వైపు చూడకుండా నాటుకోళ్ల పెంపకంపై దృష్టి సారించింది. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలతో మెప్మా ఆర్థిక సహకారంతో యూనియన్ బ్యాంక్ ద్వారా ముద్రలోను కింద తీసుకున్న రూ.5లక్షలతో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారంలోనూ మాధవి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. వాట్సాప్‌లో ప్రత్యేకంగా ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అందులో కోడి ఫొటో, జాతి ఇతర వివరాలను ఉంచుతున్నారు. ‘వనరులను వినియోగించుకుని స్వయం కృషితో ఎదగాలన్నదే నా లక్ష్యం . దీనికి తోడు మరి కొందరికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నాటుకోళ్ల పెంపకం వైపు దృష్టి సారించా’అని మాధవి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment