చదివింది ఎంటెక్.. వ్యవసాయంలో హైటెక్..
సాక్షి, మహబూబాబాద్ : తను చదివింది ఎంటెక్.. వ్యవసాయంలో హైటెక్ పద్ధతులు పాటించి ఏడాదికి రూ.20లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం శివారు గంటల్ కోల్(జీకే తండా)తండాకు చెందిన గుగులోత్ రమేశ్. ఇతను ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు. నెలకు రూ. 50వేల వేతనంతో జెనెట్ టెక్నాలజీలో ఉద్యోగం చేశారు. డిగ్రీ పూర్తి చేసిన భార్య లలితతో హైటెక్ జీవితాన్ని ఆరంభించిన రమేశ్ వ్యవసాయంపై ఉన్న మక్కువతో సొంత ఊరికి వచ్చాడు. తనకున్న ఐదు ఎకరాల చెలకలో రెండు ఎకరాల్లో పాలీ హౌజ్ నిర్మించి రంగురంగుల చేమంతి పూలు సాగుచేశారు. వీటిని హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తూ ఎకరానికి సంవత్సరానికి రూ.16లక్షల చొప్పున ఆదాయం.. రెండు ఎకరాలకు రూ. 30లక్షలకు పైగా ఆదాయం రాగా.. ఖర్చులు పోగా రూ. 20లక్షలు మిగులుతున్నాయని చెబుతున్నారు రమేశ్, లలిత దంపతులు.
Comments
Please login to add a commentAdd a comment