ప్రయాణికుల రద్దీ
ఏటూరునాగారం: సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పట్టణాల్లోని విద్యార్థులు సొంత గ్రామాలకు వెళ్లడం, మండలంలో ఉన్న విద్యార్థులు వేరే ప్రాంతాలకు తరలివెళ్తుండడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. శుక్రవారం ఏటూరునాగారం బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. కొంత మంది హాస్టల్ విద్యార్థులు వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో తరలివెళ్లారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన రోడ్లు కిక్కిరిసిపోయాయి. పండుగ వేళ ఆర్టీసీ సేవలను మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment