అసాంఘిక శక్తులపై అప్రమత్తంగా ఉండాలి
వెంకటాపురం(కె): అసాంఘిక శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. శనివారం మండల పరిధిలోని తిప్పాపురం గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమానిత, అపరిచిత వ్యక్తులు గ్రామంలోకి వస్తే తక్షణమే పోలీసులకు సమాచారాన్ని చేరవేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గ్రామస్తులకు సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని వాటిని తప్పకుండా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లోని యువత చదువు, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. చదువు, క్రీడల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామాల్లోని యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ డీఎస్పీ సతీశ్, వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతి రావు తదితరులు ఉన్నారు.
ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
Comments
Please login to add a commentAdd a comment