‘అపార్’ ఐడీ నమోదు చేయాలి
ఏటూరునాగారం: ప్రతీ విద్యార్థికి అపార్ ఐడీని నమోదు చేయాలని సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి అర్షం రాజు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాళ్లగడ్డ ఆకులవారిఘణపురం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పోచం ఆధ్వర్యంలో ఒక్కరోజు ఒరియంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం 2020 సిఫారసుల మేరకు వన్ నేషన్ – వన్ స్టూడెంట్ ఐడీ అనే ఉద్దేశంతో ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ (అపార్) అనే 12 అంకెల గుర్తింపు సంఖ్యను ఇచ్చే ప్రక్రియను కేంద్రం 2023లో ప్రారంభించిందన్నారు. శిశు తరగతి నుంచి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు అదే నంబర్ ఉంటుందన్నారు. ఈ గుర్తింపు సంఖ్యను ట్రాక్ చేయడం ద్వారా విద్యార్థుల డ్రాప్ ఔట్ రేట్ తగ్గించడం, ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లినా అతని అభ్యసన సామర్థ్యాలను ఈ ఐడీతో గుర్తించవచ్చు అ న్నారు. విద్యార్థుల పూర్తి వివరాలు ఆధార్ ప్రకారం పాఠశాలలు, కళాశాలల్లో ఒకే విధంగా ఉంటేనే అ పార్ ఐడీని జనరేట్ చేయడం జరుగుతుందన్నారు. ఆయా పాఠశాలల యజమాన్యం అపార్ ఐడీని విద్యార్థులకు నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ క్షేత్రయ్య, ఏసీఎంఓ రవీందర్, జీసీడీఓ సుగుణ, డీఈఓ కార్యాలయ సిబ్బంది హెచ్‌ఎంలు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి రాజు
Comments
Please login to add a commentAdd a comment