వైభవంగా ‘ముక్కోటి ఏకాదశి’
ఏటూరునాగారం: సీతారామచంద్రస్వామి ఆలయంలో హారతి ఇస్తున్న అర్చకుడు
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఏటూరునాగారం మండలం సీతారా మచంద్రస్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ప్రధాన అర్చకుడు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావు శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర ద్వారాన్ని తెరిచారు. ముక్కో టి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే కలిగే లాభా లను, భక్తిశ్రద్ధలతో దేవతలను పూజిస్తే వచ్చే ఫలాలను భక్తులకు వివరించారు. అలాగే సూ ర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో రామకోటి చేపట్టగా భక్తులు అధిక సంఖ్యలో రామకోటి రాసి అర్చకులకు అందజేశారు. – ఏటూరునాగారం
– మరిన్ని ఫొటోలు 11లోu
Comments
Please login to add a commentAdd a comment