హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జెడ్పీ మాజీ వైస్ చైర్‌పర్సన్, నియోజక వర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని మేడారంలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చెప్పి.. ఏడాది పాలన పూర్తయినా పథకాలు మాత్రం అమలు కావడం లేదన్నారు. ఈ నెల 26నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు నేటికీ పదిలంగా ఉన్నాయన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ మేరకు స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులుగా దండుగుల మల్లయ్య, దిడ్డి మోహన్ రావు, రామసాయం శ్రీనివాసరెడ్డి, ముండ్రాతి రాజమౌళి, కొండూరి నరేష్, జీడి బాబు, గోపన బోయిన కొమురయ్య, పాయం నర్సింగరావులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దుర్గం రమణయ్య, మేడారం జాతర కమిటీ మాజీ చైర్మన్ కాక లింగయ్య, నాయకులు ఎనగందుల బాపిరెడ్డి, చిడం బాబురావు, సిద్ధబోయిన శివరాజు, అలేటి ఇంద్రారెడ్డి, దానుక నర్సింగరావు, గజ్జల సమ్మయ్య, గోపాల్‌రెడ్డి, ఎల్లయ్య, విక్రమ్ పాల్గొన్నారు.
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి
Comments
Please login to add a commentAdd a comment