98 శాతం పూర్తయిన సర్వే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ప్రజాపాలనలో 90,863 మంది ఇళ్లు కావాలని దరఖాస్తు చేశారు. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో సర్వే నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 88,552 మంది దరఖాస్తుల సర్వే పూర్తయింది. ఇందులో సొంత స్థలం ఎంతమందికి ఉంది, ఇందిరమ్మ గృహానికి అర్హులేనా కాదా అనే రీతిలో పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తూ మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లాలో 98 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల ఆఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment