విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి
తాడూరు: విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. మంగళవారం స్థానిక కేజీబీవీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనికిరాని సింగిల్ యాస్ ప్లాస్టిక్ చేత ఉపయోగకరమైన పరికరాలు తయారు చేయడం, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసుకురావడంలో తోడ్పడుతుందన్నారు. పాఠశాల ఆవరణలో ఫ్రం వేస్ట్ మెటీరియల్ రీయాప్స్ మేళా కార్యక్రమం చాలా బాగుందన్నారు. కేజీబీవీ విద్యార్థులు ఎంతో ప్రయోగాత్మకంగా వేస్ట్ మెటీరీయల్‌ను రీయూజ్ చేసే విధంగా పరికరాలు డెకరేషన్ పరంగా తయారు చేసి సఫలమయ్యారన్నారు. గ్రామాల్లోని పరిసరాలు ఉన్న వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించి డెకరేషన్ వస్తువులు తయారు చేయడం ద్వారా పరిసరాలు శుభ్రంగా ఉండి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చేతుల శుభ్రతపై నిర్వహించిన నాటిక ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపన్యాస, పెయింటింగ్ పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీఓ బ్రహ్మచారి, జీఈసీఓ శోభారాణి, కోఆర్డినేటర్ ఊశన్న, కార్యదర్శి పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment