అక్రమ దందాల్లో ఖాకీలు
వారి తీరుతో అప్రతిష్ట
పోలీస్‌శాఖలోని కొంతమంది అధికారుల తీరు ఆ శాఖను అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొంతమంది సీఐ, ఎస్‌ఐలు అక్రమ దందాల్లో పాలుపంచుకుని అందినకాడికి దండుకుంటున్నారు. వీరి పనితీరుపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారుల నుంచి స్పందన కొరవడటంతో ఇన్నాళ్లుగా వీరి ఆగడాలు సాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుభీ వాగు పరిసర మండలాలు, గ్రామాల్లో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా దందాకు పలువురు పోలీస్ అధికారులు అండగా నిలుస్తున్నారు. నెలనెలా పెద్దఎత్తున మాముళ్లు దండుకుంటూ ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల ఆదాయం దక్కకుండాపోతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి, ఉల్పర, చింతపల్లి తదితర గ్రామాల్లో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో ఎస్‌ఐ లెనిన్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వంగూరు మండలం నుంచి ప్రభుత్వ పనుల పేరుతో పెద్దఎత్తున ఇసుకను తరలించి.. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఎస్‌ఐ మహేందర్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ చర్యలు చేపట్టారు. తెలకపల్లి మండలంలోని నడిగడ్డ, తాళ్లపల్లి, గౌరారం గ్రామాల్లో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా సాగుతుండగా కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ నరేశ్‌పై వేటు వేసింది. బిజినేపల్లి మండలంలో పనిచేస్తున్న ఎస్‌ఐ నాగశేఖరరెడ్డి తీరు తరచుగా వివాదాస్పదంగా మారింది. కుక్క కారణంగా జరిగిన చిన్న గొడవ విషయంలో వెల్గొండకు చెందిన ఓ వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి చేయి చేసుకున్నాడన్న కారణంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేకాట రాయుళ్ల నుంచి వసూళ్లకు పాల్పడటం, కోడి పందేల నిర్వాహకుల నుంచి పెద్దఎత్తున డబ్బులు దండుకోవడం వంటి అక్రమ దందాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని తూంకుంట, కొండూరు వాగుల్లో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వీపనగండ్ల, చిన్నంబావి ఎస్‌ఐలపై వేటుపడింది.
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా కట్టడిలో నిర్లక్ష్యం వహిస్తూ.. లోపాయికారీగా దందాను ప్రోత్సహిస్తున్న పలువురు ఎస్‌ఐపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు ఎస్‌ఐలను వీఆర్‌కు అటాచ్ చేస్తూ గురువారం మల్టీజోన్– 2 డీఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో వనపర్తి జిల్లా వీపనగండ్ల, నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలను వీఆర్‌కు అటాచ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన ఖాకీలే అక్రమార్కులతో అంటకాగుతూ ప్రోత్సహిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించి చర్యలకు పూనుకోవడంతో సదరు పోలీస్ అధికారుల్లో గుబులు రేపుతోంది.
● ఉమ్మడి జిల్లాలో ఐదుగురు ఎస్‌ఐలపై వేటు
● ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న
వారిపై చర్యలు
● వీఆర్‌కు అటాచ్ చేస్తూ డీఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు
● మరికొందరు పోలీసుఅధికారులపై నిఘా
పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు అక్రమ దందాలకు సహకరిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీస్ నిఘా వర్గాల ద్వారా సదరు అధికారుల తీరుపై నిఘా ఉంచి విచారణ చేపట్టింది. విచారణలో అక్రమాలు నిగ్గు తేలాక సదరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇసుక అక్రమ రవాణా, అక్రమ రేషన్ బియ్యం దందా, కోడిపందేలు, పేకాట రాయుళ్ల నుంచి వసూళ్లు, అక్రమ దందాలను ప్రోత్సహించడం, విచ్చలవిడిగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీస్ అధికారులపై నిఘా పెంచినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు లు వస్తున్న పోలీస్ అధికారులపై ఆయా జిల్లాల ఎస్పీల ఆధ్యర్యంలో విచారణ చేపట్టి, చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవే ఆరోపణలతో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా చిన్నంబావి పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలను ఇప్పటికే బదిలీ చేశామని తెలిపారు. పర్యావరణానికి నష్టం కలిగించేలా నదులు, వాగుల్లో విచక్షణారహితంగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభు త్వం సీరియస్‌గా ఉందని, దీనిపై ఆయా జిలా ్లల ఎస్పీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు.
సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ
ఫిర్యాదుల నేపథ్యంలో..
ఇప్పటికే ఇద్దరు బదిలీ..
Comments
Please login to add a commentAdd a comment