23,22,054
సాక్షి, నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా ఓటరు తుది జాబితాను ప్రచురించింది. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో 71 మండలాల పరిధిలోని 1,700 పంచాయతీల్లో 15,276 వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 23,22,054 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 11,67,893 మంది, పురుషులు 11,54,128 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మినహా మిగతా జిల్లాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉంది. కాగా.. ఉమ్మడి జిల్లాలో నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 6,46,407 మంది ఓటర్లు ఉండగా.. వనపర్తి జిల్లాలో తక్కువగా 3,67,521 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీలు, వార్డులు కూడా నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కీలకమైన ఓటరు జాబితా సిద్ధం కావడంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ సారి మూడు విడతలుగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. సుమారు తొమ్మిది నెలలుగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా, అందుకనుగుణంగా అధికార యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది. ఓటర్ల తుది జాబితా సైతం పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపై పడింది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. ఈసారి కులగణన పూర్తయ్యాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కులగణనను ఎప్పటినుంచి చేపడతారన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఉమ్మడి పాలమూరులో గ్రామీణ ఓటర్లు
రిజర్వేషన్లపైనే ఆసక్తి..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామీణ ఓటర్ల వివరాలు..
పంచాయతీ ఎన్నికలకు తుది ఓటరు జాబితా సిద్ధం చేసిన ఎన్నికల సంఘం
15,276 వార్డుల వారీగా
సిద్ధమైన తుది జాబితా
నాగర్‌కర్నూల్ మినహా మిగతా 4 జిల్లాల్లో మహిళలే అధికం
స్థానిక పోరుకు యంత్రాంగం సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment