కొల్లాపూర్: పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సిటీ సివిల్ కోర్టు న్యాయవాది ఖలీల్‌ను పోలీసులు దాడిచేసి గాయపర్చడం దారుణమన్నారు. దాడిని నిరసిస్తూ విధులు బహిష్కరించినట్లు వారు వివరించారు. దాడికి పాల్పడిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నె శ్రీహరి, న్యాయవాదులు ఉపేందర్, వసంతరెడ్డి, శివారెడ్డి, మధుసూదన్‌రావు, నజీరొద్దీన్, గోవిందు, కురుమూర్తి, బాలస్వామి, నిరంజన్, మనోహర్, రాజేష్, రామలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment