గద్వాల: బ్రిటీష్ పాలనకు ముందు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లాలంటే సామాన్యులంతా ఎడ్లబండ్లు.. లేదా కాలినడకన.. కొద్దిగా ఆర్థికంగా ఉన్నవారు గుర్రాలపై వెళ్లేవారు. అప్పటికీ ఎలాంటి రవాణా సౌకర్యం ఉండేదికాదు. కానీ.. అలాంటి సమయంలోనే గద్వాల సంస్థానంలో బొగ్గుతో నడిచే స్టీమ్ ఇంజిన్ బస్సు రయ్‌రయ్ మంటూ పొగలు చిమ్ముకుంటూ పరుగులు పెట్టేది. 1600 సంవత్సర కాలంలో పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానాన్ని ఏర్పాటుచేసుకుని నలసోమనాద్రి అనే రాజు తన పాలనను సాగించాడు. కాలక్రమేణా.. బ్రిటీష్ పాలన.. దేశానికి స్వాతంత్య్రం.. రజాకార్ల పాలన.. తెలంగాణకు విముక్తి లభించగా సంస్థానాన్ని స్వాతంత్య్ర భారతదేశంలో విలీనం చేశారు. ఈక్రమంలో తెలంగాణలోని గద్వాల సంస్థానాన్ని భారతదేశంలో కలిపేందుకు అప్పటి సంస్థాన మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ తన సుముఖతను వ్యక్తం చేస్తూ భారత ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గద్వాల సంస్థానంలో 1889లోనే బస్సు సౌకర్యం ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment