నవరాత్రి పూజల్లో పాల్గొన్న సీఎం సతీమణి
కల్వకుర్తిరూరల్/వంగూరు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం కల్వకుర్తి వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీత ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం రూ. లక్ష విరాళం అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గీతను శాలువాతో సత్కరించి, మెమోంటో అందజేశారు. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత నిధులతో నిర్మిస్తున్న ఆంజనేయస్వామి, శివాలయాల నిర్మాణ పనులను గీత పరిశీలించారు. కార్యక్రమాల్లో వాసవీమాత ఆలయ కమిటీ చైర్మన్ జూలూరు రమేష్‌బాబు, శ్రీనివాస్, నారాయణరాజు, శ్రీధర్, అశోక్, జగదీశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment