తల్లిదండ్రుల సంరక్షణ.. బాధ్యత
నాగర్‌కర్నూల్: కని పెంచిన తల్లిదండ్రులను భారంగా భావించరాదని.. వృద్ధాప్యంలో వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధులతో ప్రతి ఒక్కరూ గౌరవంగా మెలగాలన్నారు. వారిని ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వయోవృద్ధుల హక్కులు, చట్టాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి తదితరులు పాల్గన్నారు.
Comments
Please login to add a commentAdd a comment