సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
నాగర్‌కర్నూల్ క్రైం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ సంబరాలు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌బాబు అన్నారు. తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులతో పాటు ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం సమీపంలోని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్‌జడ్జి సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి మౌనిక తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment