నల్లమలను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం
అచ్చంపేట: నల్లమలను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటకశాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమే ష్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆదివారం ఉమామహేశ్వరం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భోగమహేశ్వరం టూరిజం గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నల్లమలలో ఇప్పటికే పర్యాటక ప్రాంతాలను గుర్తించామని.. వాటి అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి, పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు, పర్యాటకులను నల్లమల ప్రాంతం ఎంతో ఆకట్టుకుంటుందని, పర్యాటక ప్రియుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టూరిజంశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన విశ్రాంతి గదులు, హోటల్‌ను ఉమామహేశ్వరం ఆలయానికి కేటాయించేందుకు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడతామని చెప్పారు.
● ఉమామహేశ్వరం కొండపైకి మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమి పూజ చేశారు. రూ. 5లక్షల ఎన్‌డీఎఫ్ నిధులతో రంగాపూర్ నుంచి ఉమామహేశ్వరం వరకు పైప్‌లైన్ ని ర్మిస్తున్నట్లు తెలిపారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
అచ్చంపేట: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను అవమానించడంతో పాటు హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో రిజర్వేషన్లు తొలగించాలనే ఉద్దేశంతోనే ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బీజేపీ అవలంబిస్తున్న విధానాలతో దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అచ్చంపేటలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీలో రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. ప్రజాస్వామ్య వాదులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమామహేశ్వరం దేవస్థానం చైర్మన్ భీరం మాధవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి.రాజేందర్, ఈఓ శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రజిత, అర్చకుడు వీరయ్యశాస్త్రి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.గోపాల్‌రెడ్డి, మల్లేష్, లచ్చునాయక్, లోక్యానాయక్, పవన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment