సంపన్న వర్గాల కోసమే లేబర్ కోడ్‌లు
పెంట్లవెల్లి: సంపన్న వర్గాలకు కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చిందని సీఐటీయూ ఆల్ హమాలీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ అన్నారు. మండలంలోని జటప్రోల్‌లో ఆదివారం నిర్వహించిన హమాలీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రెన్యువల్ రూపంలో రూ. లక్షలు చెల్లిస్తున్నారని.. హమాలీల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పథకాల్లో హమాలీలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. సమావేశంలో మైమూద్ పాషా, నిరంజన్, రామకృష్ణ, లక్ష్మయ్య, బాబు, వెంకటస్వామి, మహేష్, శివకుమార్ ఉన్నారు.
డబుల్‌బెడ్రూం ఇళ్లు
కేటాయించండి
కల్వకుర్తిరూరల్: పట్టణంలో నిర్మించిన 240 డబుల్‌బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం డబుల్‌బెడ్రూం ఇళ్ల వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డబుల్‌బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల పోరాట సంఘం నాయకులు మాట్లాడుతూ.. లక్కీ డిప్ ద్వారా ఇళ్లకు ఎంపికచేసి ఏడాదిన్నర కావొస్తున్నా లబ్ధిదారులకు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించకపోతే.. తామే ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంజనేయులు, కృష్ణవేణి, నర్సింహ, పద్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment