నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్, పదర, బల్మూరు, అచ్చంపేట, లింగాల మండలాల్లోని కొన్ని గ్రామాలను ప్రభుత్వం ఏజె న్సీ ఏరియాగా గుర్తించింది. అయితే ఇతర జిల్లాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నకిలీ ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు సమర్పించి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అటవీశాఖలో ఉద్యోగాలు పొందినట్టుగా ఫిర్యాదులు అందాయి. నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలు సమర్పించి ఇతరులు ఉద్యోగాలు పొందుతుండటంతో స్థానికులకు అన్యాయం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment