క్రీడారంగానికి రూ. 370 కోట్ల బడ్జెట్
కల్వకుర్తి రూరల్: బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక బడ్జెట్‌లో క్రీడారంగానికి రూ.370 కోట్లు కేటాయించారని తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తిలో జరిగిన 10వ తెలంగాణ క్రాస్‌కంట్రీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూ ఎవరూ చేయలేని విధంగా 7 వేల మంది అథ్లెట్లతో మెగా ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ క్రీడలకు వేదిక కానుందని.. ఇండియా, మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ క్రీడలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. 35 ఏళ్లుగా విద్యార్థులతో తనకు ఎంతో అనుబంధం ఉందని, క్రీడలతో జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ సాధ్యమని చెప్పారు. కల్వకుర్తిలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఇరువురు శుభాకాంక్షలు చెప్పి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టాన్లీ జేమ్స్, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, మార్కెట్ చైర్మన్ మనీలా సంజీవ్‌కుమార్, మాజీ సర్పంచ్‌లు ఆనంద్‌కుమార్, భూపతిరెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి స్వాములు, అంతర్జాతీయ అథ్లెట్ లావణ్యరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, పీడీలు తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్ పోటీల్లో పురుషుల విభాగంలో మేడ్చల్‌కు చెందిన యోగేందర్ యాదవ్ ప్రథమస్థానం, హైదరాబాద్‌కు చెందిన రమేష్ 2వ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో నల్గొండకు చెందిన ఉమా ప్రథమస్థానంలో, మహబూబ్‌నగర్‌కు చెందిన మహేశ్వరి 2వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment